విలన్ గా సునీల్ లుక్ చూశారా !
కమెడియన్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారి అందాల రాముడు అనే సినిమాని తీశాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో సునీల్ కి మంచి పేరు వచ్చింది.
కమెడియన్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారి అందాల రాముడు అనే సినిమాని తీశాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో సునీల్ కి మంచి పేరు వచ్చింది. కానీ మళ్ళీ కమెడియన్ గానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో చేసిన మర్యాద రామన్న సినిమాకి మరింత పేరు రావడంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత పూలరంగడు, భీమవరం బుల్లోడు లాంటి హిట్స్ వచ్చి సునీల్ కి మంచి బ్రేక్ ని ఇచ్చాయి. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి.
హీరోగా అవకాశాలు తగ్గుముఖం పడుతుండడంతో మళ్ళీ కమెడియన్ గా మారిపోయి పలు చిత్రాలలో నటించాడు. ఇక హీరో నుంచి మళ్ళీ విలన్ పాత్రలవైపు ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజా సినిమాలో విలన్ గా నటించాడు. అందులో సునీల్ నటనకి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు విలన్ గా మరో సినిమాని చేస్తున్నాడు సునిల్.. అదే 'కలర్ ఫొటో' .. ఈ రోజు సునీల్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సినిమాలో సునీల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. రామరాజుగా సునీల్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.
'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' లాంటి స్పూఫ్ కామెడీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్.. లౌఖ్య ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. హస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఈ సినిమాతో తొలిసారి హీరో అవతారం ఎత్తాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. సందీప్‌రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.