రామా, రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం పూజా ప్రసాద్‌తో రేపు(డిసెంబర్) జరగనుంది. ఈ వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో రాజమౌళి ఇంట పెళ్లి సందడి నెలకొంది. కార్తీకేయ, పూజా ప్రసాద్ గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఇటీవల ఒప్పించారని సమాచారం. దాంతో వీరిద్దరికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. కాగా పూజ ప్రసాద్ ప్రముఖ నటుడు జగపతిబాబు అన్న రాంప్రసాద్ కూతురు.
కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక పెళ్లికుమార్తే పూజా ప్రసాద్ గాయని. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు. కాగా వీరి వివాహ వేడుకకు జైపూర్‌లో ఓ ప్రైవేట్ హోటల్ వేదిక. ఈ పెళ్లి పనుల కోసం రాజమౌళి ఓ నెల రోజుల పాటు హాలిడేస్ కూడా తీసుకున్నారు. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా గురువారమే జైపూర్ చేరుకున్నారు. అతిథులందరూ శుక్రవారం జైపూర్ ప్రయాణం అయ్యారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, అనుష్క తదితరులుఈ వేడుకకు హాజరుకానున్నారు.