సోనూసూద్ సేవలను ప్రశంసించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వలస కూలీల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.

Update: 2020-05-25 04:05 GMT
Smriti irani, Sonu sood(File photo)

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వలస కూలీల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ప్రజారవాణా లేకపోవడంతో కాలినడకన వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి కొందరు ముందుకి వచ్చి తమ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖ విలన్.. సోనుసూద్. గత కొన్ని వారాలుగా సొంతంగా బస్సులను ఏర్పాటుచేసి వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ సహాయం కోరుతున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి ఆయన స్పందిస్తున్నారు. సహాయం అందిస్తున్నారు.

సోనూసూద్ చేస్తున్న సేవలకు గాను ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రీల్ లైఫ్ లో విలన్ అయిన రియల్ లైఫ్ లో హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సోనూసూద్ సేవలను ప్రశంసిస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "వృత్తిపరమైన సహచరుడిగా గడిచిన రెండు దశాబ్దాలుగా మీ గురించి నాకు తెలుసు. మీరొక నటుడిగా ఎదగడాన్ని చూసి ఎంతో సంతోషించాను. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది. మీవంతు సాయం చేసి ఎంతోమందికి అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.

ఇక సోనూసూద్ సినిమాల విషయానికి వచ్చేసరికి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనూసూద్ స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత జులాయి, దూకుడు, ఆగడు,కందిరీగ మొదలైన సినిమాల్లో నటించి మంచి విలన్ గా స్థిరపడిపోయారు.




 


Tags:    

Similar News