బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ 13 సీజన్ ముగిసింది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షో గ్రాండ్ఫినాలే కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ షోలో కామెడీ కింగ్ సునీల్ గ్రోవర్, భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఇక ఈ సీజన్ విజేతగా అందరు అనుకున్నట్టుగానే సిద్ధార్థ్ శుక్లా నిలిచాడు. ఇక అసిమ్ రన్నరప్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా రూ.40 లక్షల ప్రైజ్‌మనీ, లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో టాప్ 5 లో నిలిచినా వారికీ అబుదాబీలోని అడ్వెంచర్ పార్క్‌ను సందర్శించే అవకాశాన్ని సల్మాన్ ఖాన్ కల్పించాడు
గ్రాండ్ఫినాలేలో మొత్తం ఆరుగురు ఆరుగురు కంటెస్టెంట్లు ఆర్తి సింగ్, రష్మీ దేశాయ్, షెహనాజ్ గిల్, పారాస్, సిద్ధార్థ్ శుక్లా, అసిమ్‌లు పోటిపడ్డారు. ఇందులో గెలుస్తామన్న నమ్మకం లేని వారు రూ.10 లక్షలు తీసుకొని షో నుంచి వెళ్లవచ్చునని సల్మాన్ చెప్పడంతో పరాస్ నుంచి మొదలు ఆర్తి సింగ్, రష్మీ దేశాయ్, షెహనాజ్ గిల్ ఒక్కొక్కరుగా వైదొలిగారు. ఇక ట్రోఫీ కోసం సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ పోటి పడగా సిద్ధార్థ్ శుక్లాని విజయం వరించింది. దీనితో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ట్రోఫీని గెలవడంతో సిద్ధార్థ్ శుక్లా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇన్ని రోజులు సాగినా ఈ షో రేపటినుంచి ఉండదు అని తెలియడంతో కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక మళ్ళీ బిగ్‌బాస్ సీజన్ 14తో మళ్లీ కలుద్దాం అని సల్మాన్ కూడా వీడ్కోలు తీసుకున్నాడు.
సిద్ధార్థ్ శుక్లా ఎవరు ?
సిద్ధార్థ్ శుక్లా సినీ టెలివిజన్ కి సంబంధించిన నటుడు.. ముంబైలో జన్మించాడు. అతను తండ్రి అశోక్ శుక్లా..తల్లి రితా శుక్లా.. సిద్ధార్థ్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, సిద్ధార్థ్ శుక్లా తెలుగులో ప్రసారం అయిన చిన్నారి పెళ్లికూతురులో శివరాజ్ శేఖర్ అనే పాత్రలో నటించాడు. అంతేకాకుండా పలు హిందీ సీరియళ్లలో కీలకపాత్రలు పోషించాడు .
Truly the qualities that a winner should've possessed , were in ASIM ! His journey video said it all ! #MyWinnerASIM ......
— Gauahar Khan (@GAUAHAR_KHAN) February 15, 2020