సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇక లేరు!

Update: 2020-02-11 08:10 GMT

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) అనారోగ్యంతో కన్నుమూశారు. . యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన ఆయన ఆస్పత్రిలో చేరి మరణించారు. అయన మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు జర్నలిస్టులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పసుపులేటి పనిచేశారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. పసుపులేటి రామారావు డిగ్రీ చదివారు.ఆయన చిత్ర పరిశ్రమలోని 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతోను ఇంటర్య్వులు తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు.

రామరావు నాకు ఆత్మబంధువు : చిరంజీవి

పసుపులేటి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని అన్నారు. ఇక సినియర్ జర్నలిస్టుగా మాత్రమే కాకుండా తనకి వ్యక్తిగతంగా కూడా తనకెంతో ఇష్టమని అన్నారు. అయన మరణం నన్ను ఎంతో భాదేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.. పసుపులేటి కుటుంబానికి అండగా ఉంటానని చిరంజీవి అన్నారు.  

Tags:    

Similar News