మహేశ్ ఫ్యాన్స్కి మరో సర్ప్రైజ్..!
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం ఇండియన్ ఆర్మీకి నివాళిగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఇక భారత్ పాకిస్థాన్ యుద్ధం నుంచి మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ వరకు భారత జవానులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఈ పాటలో కల్లకు అద్దినట్లు చూపించారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం ఇండియన్ ఆర్మీకి నివాళిగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఇక భారత్ పాకిస్థాన్ యుద్ధం నుంచి మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ వరకు భారత జవానులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఈ పాటలో కల్లకు అద్దినట్లు చూపించారు. దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన "సరిలేరు నీకెవ్వకు" సాంగ్ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది. ఒక సైనికుడు గురించి ఒక్కమాటలో చెప్పలంటే ఈ సాంగ్ భారత్ పాక్ మధ్య జరిగిన యుద్దం యాదీ వోచ్చేలే చేస్తోంది.
ఇందులో మహేష్ బాబు ఆర్మీ డ్రెస్స్ లో దేశసైనికుడి లుక్ లో ఓ అగ్నికణంల అవుపిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కానుంది. మేజర్ అజయ్ కృష్ణగా ఉగ్రవాదులను ఏరిపారేసే సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు మహేష్ బాబు. బండ్ల గణేష్, విజయశాంతితో పాటు పలువురు సినీ నటులు నటిస్తున్నారు. రష్మిక మంథాన కథానాయికగా నటిస్తుంది. ఈ సాంగ్ విడుదల గంటల్లో లక్షల్లో వ్యూస్ వోస్తున్నాయి. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సాంగ్ ట్రెండింగ్ లో సాగుతోంది.