సినిమాలు చూసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానుల పట్ల హీరోలు కూడా ఎనలేని ప్రేమ, ఆదరణ చూపుతారు. వారిలో యువ హీరో సందీప్‌కిషన్ కూడా ఉంటారు. సందీప్ తొలి చిత్రం నుండి ఆయనకు అభిమానిగా మారారు ప్రొద్దుటూరుకు చెందిన కడప శ్రీను. శుక్రవారం దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతిచెందారు. అభిమాని మృతి
గురించి తెలుసుకున్న సందీప్ కిషన్ తీవ్రంగా బాధపడ్డారు. దాంతో కడప శ్రీను కుటుంబసభ్యులను ఫోనులో పరామర్శించిన సందీప్ కిషన్.. కడప శ్రీను దహన సంస్కారాలకైయ్యే డబ్బులు ఇవ్వడంతోపాటు ఆయన తల్లికి నెలకు ఏడువేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. 'అన్ని సందర్భాల్లో నాకు అండగా నిలబడ్బ నా తొలి అభిమానిని కోల్పోవడం బాధాకరం. చిన్న వయసులోనే నా సోదరుడు దూరం కావడం బాధాకరం. నీ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను శ్రీను. నీ కుటుంబ బాధ్యత నాది. లవ్ యు శ్రీను.. నీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు సందీప్.