ప్రభాస్.. ఇపుడు ఇండియన్ స్టార్. బాహుబలితో అమాంతం రేంజ్ పెరిగిపోయిన తెలుగు హీరో. బాహుబలి తరువాత క్రేజీ సినిమా చేస్తున్నాడు. అదే సాహో. ఇందులో భారతీయ వెండితెర పై మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాల్ని చూపించబోతున్నారట. ఇప్పటికే ఈ సన్నివేశాలకు సంబంధించిన ప్రోమోలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అభిమానులు.. సినిమా ప్రేమికులు.. సాహో సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు పదిహేనున ఈ సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సాహో టీజర్ ను విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13 న టీజర్ ను విడుదల చేస్తున్నారు. దానిని 14 నుంచి థియేటర్లలో చూడొచ్చట. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. సుహిట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్.
The action BEGINS 😎
— UV Creations (@UV_Creations) June 10, 2019
Enter the world of #SAAHO with the teaser on 13th June.
Experience it in theaters from 14th June! 👊 #Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #SaahoTeaser #15AugWithSaaho pic.twitter.com/yxj6bLmPtA