సరిలేరు నీకెవ్వరు నుంచి రష్మిక లుక్ రిలీజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Update: 2019-12-12 16:51 GMT
Rashmika Mandanna

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజ్ , అనిల్ సుంకర లతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్స్ ,టిజర్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలును క్రియేట్ చేశాయి. కానీ సినిమా నుంచి ఇంతవరకు హీరో రష్మిక-మహేష్ బాబు కాంబినేషన్ పోస్టర్స్ ని బయటకు వదలలేదు చిత్రబృందం .

తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లోని పోస్టర్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.. ఈ పోస్టర్స్ కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇద్దరు పెయిర్ చూసి బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాని సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న విడుదల చేయనున్నారు. రావు రమేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.  


Delete Edit


Tags:    

Similar News