'రణరంగం' ట్విట్టర్ రివ్యూ..

యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన సినిమా రణరంగం. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Update: 2019-08-15 04:18 GMT

యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన సినిమా రణరంగం. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. అప్పటికే టీజర్, ట్రైలర్లతో అందరి అంచనాలను ఆకాశానికి పెంచేశాడు. ఇక ఎట్టకేలకు నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది రణరంగం. అయితే ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షో నడవడంతో మూవీ టాక్ బయటకు వచ్చింది. అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌గా రణరంగంలో శర్వా నటించిన పాత్రలో దూమ్మూరేపాడు అని, గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండటమే కాకుండా ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడి ఉందని అంటున్నారు. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. 'గ్యాంగ్ స్టర్' పాత్రలో శర్వానంద్ నటన అద్భుతంగా ఉందని.. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.అలాగే సినిమాలో 'అల్లుడా మజాకా' రిలీజ్ డే ఉందట. చిరంజీవి కటౌట్‌ను చూపించారని.. థియేటర్‌లో గోల గోల అని మరొక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. మొత్తానికి 'రణరంగం' సినిమా ఎలా ఉందో ఇంకా తెలియకపోయినా ప్రస్తుతానికైతే నెటిజన్ల నుండి మాత్రం పాజిటివ్ టాక్ వోస్తుంది. చూడాలి మరి మొత్తం సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.


Tags:    

Similar News