అమ్మ గా కనపడనున్న శివగామి

అటు సినిమాల్లోనే కాక ఇటు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

Update: 2019-01-04 10:04 GMT
Ramya Krishna

అటు సినిమాల్లోనే కాక ఇటు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప రాజకీయ నాయకురాలు జీవిత చరిత్ర ఆధారంగా 'ఏ మాయ చేసావే' ఫేమ్ దర్శకుడు గౌతం మీనన్ ఒక వెబ్స్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. ఎలాంటి కష్టమైన పాత్ర అయినా సరే పాత్రకు ప్రాణం పోసినట్టు నటించగల సత్తా ఉన్న అందాల నటి రమ్య కృష్ణ ఈ వెబ్ సిరీస్ లో జయ లలిత పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

రాజమాత శివగామి గా బాహుబలి సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బుర పరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు జయలలిత పాత్రలో మనల్ని మెపించనున్నారు. ఇదిలావుండగా, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మూడు చలన చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో మొదటిది ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ది ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కే చిత్రం. ఇందులో జయలలితగా నిత్యా మీనన్ కనిపించనుంది. మరొకటి దర్శకుడు విజయ్ తెరకెక్కించనున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో విద్యాబాలన్ అమ్మగా కనిపించనుండగా సాయి పల్లవి, శశికళ పాత్రలు కనపడనుంది. ఇక మూడవ బయోపిక్ ను ప్రముఖ దర్శకుడు భారతీరాజా నిర్మించనున్నారు.

Similar News