ఒకప్పటి నా గది.. ఇప్పుడు లేడీస్ హాస్టల్: రామ్ గోపాల్ వర్మ

Update: 2019-05-28 11:54 GMT

ఒకప్పుడు నేను అద్దెకు ఉన్న గాడి ఇప్పుడు లేడీస్ హాస్టల్ గా మారిపోయింది అంటున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన విజయవాడ లో చదువుకున్నారు. ఆ సమయంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వెనుక ఉన్న ఓ గదిలో అద్దెకు ఉండేవారట. దాదాపు రెండేళ్లకు పైగా ఆ గదిలోనే ఉన్నారట వర్మ. అయితే, ఇటీవల విజయవాడ వెళ్లిన ఆర్జీవీ.. తన ఒకప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా తానూ అద్దెకు ఉన్న గది కి వెళ్లారు. అక్కడ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిలతో కల్సి ఫోటో తీసుకున్నారు. ఇపుడు ఆ ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసి తన కాలేజీ రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను శ్రీదేవి పోస్టర్ ను ఫొటోలో తన వెనుక ఉన్న గోడకు అతికించేవాడినని ఆయన పోస్ట్ లో  పేర్కొన్నారు.   


 

Similar News