రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన చెర్రీ

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, చరణ్ వాక్చాతుర్యం బాగుంటుందని, అతను రాజకీయాల్లోకి రావొచ్చని సరదాగా అన్నారు.

Update: 2019-01-07 10:11 GMT
Ramcharan

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, చరణ్ వాక్చాతుర్యం బాగుంటుందని, అతను రాజకీయాల్లోకి రావొచ్చని సరదాగా అన్నారు. అయితే కేటీఆర్ మాటలు విన్న తర్వాత చాలామంది రామ్ చరణ్ రాజకీయాల్లో అడుగు పెడుతున్నాడు అంటూ పుకార్లు సృష్టించారు. ఈ రూమర్లపై ఈ మధ్యనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యాడు. తన పొలిటికల్ ఎంట్రీ పైన ఒక క్లారిటీ ఇచ్చాడు.

"కేటీఆర్ గారు కేవలం నా స్పీచ్ ని మెచ్చుకోవాలని అలా అన్నారు. అయినా నాకంటే బాగా మాట్లాడే వారు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాని రాజకీయాల్లో రాణించడానికి కేవలం మాట్లాడడం మాత్రమే వస్తే సరిపోదు. రాజకీయాల్లో ఉండడానికి బాధ్యత, నాలెడ్జ్, మరియు డెడికేషన్ ఉండాలి" అని అన్న రామ్ చరణ్ ఇప్పట్లో రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. ఇక భారీ అంచనాల మధ్య 'వినయ విధేయ రామ' సినిమా జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

Similar News