తెరపైనే కాదు తెర వెనుక కూడా రీయల్ హీరోలని కొందరు మాత్రమే అనిపించుకుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేరాడు. గతేడాది డిసెంబర్ 8న గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఈ వార్త మెగా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని రామ్ చరణ్ ఆ రోజే ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్.. రూ.10 లక్షల చెక్‌ను ఇటీవలె కన్నుమూసిన నూర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ఇంటికి పిలిపించి మరి అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రమే కాదు నెటిజన్లు సైతం రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.