ఆ నలుగురు లాంటి సినిమా ఇది...

Update: 2019-10-14 16:12 GMT

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎంత గొప్ప నటుడో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కామెడి,ఎమోషన్ ఇలా అన్ని రకాల పాత్రలను మెప్పించగలరు. తాజాగా అయన నటిస్తున్న చిత్రం 'తోలుబొమ్మలాట'... ఇందులో అయన 'సోడాల్రాజు' అనే పాత్రను పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకి సిద్దం అవుతుంది. ఈ సినిమాకి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించారు. అయితే సినిమా గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా అన్ని సినిమాల్లో ది బెస్ట్ ఫైవ్ సినిమాల్లో ఈ 'తోలుబొమ్మలాట' కచ్చితంగా ఉంటందని చెప్పుకొచ్చారు. బంధాలకి స్నేహాలకి విలువలు చెప్పే సినిమా ఇది అని అన్నారు. ' ఆ నలుగురు' తరువాత ఇంతకన్నా చేయడానికి ఇంకేముంటుందిలే అనుకున్నాను. కానీ చేయాల్సింది ఇంకా చాలానే ఉందని చెప్పిన సినిమా ఇదని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, అందరు చాలా చక్కగా నటించారని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్.. 

Tags:    

Similar News