నిర్మాతల బాగుకోరే హీరో బాలయ్య : సీ కళ్యాణ్

Update: 2019-11-02 16:10 GMT
balakrishna,c kalyan,ks ravikumar

కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రూలర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సీ కళ్యాణ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన వేదిక,సోనాలి చౌహాన్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకోసం బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని వార్తలు వచ్చాయి.

అయితే దీనిపైన ఆ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచడాని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. అయన నిర్మాతల బాగుకోరే మనిషి అని, అయనతో నేను చాలా సినిమాలు చేసానని అయన చెప్పుకొచ్చారు. అసలు మా మధ్య రెమ్యునరేషన్ గురించి చర్చే జరగలేదని, సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని అయన అన్నారు. డిసెంబర్ లో సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News