శశికళ పాత్రలో ప్రియమణి ?
జయలలిత జీవితంలో ముఖ్య వ్యక్తి అయిన శశికళ పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది
సినీ,రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా బయోపిక్ లు తెరకేక్కుతున్నాయి. అందులో భాగంగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితపై తలైవి అనే బయోపిక్ తెరకెక్కుతుంది.కంగనా ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అయితే జయలలిత జీవితంలో ముఖ్య వ్యక్తి అయిన శశికళ పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో జయలలితగా సినీ పరిశ్రమకి రాకముందు, సినీ పరిశ్రమలో మంచి నటిగా రాణిస్తున్న సమయంలో, రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగనా సందడి చేయనుందట . ఈ చిత్రం కోసం ఆమె 20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తుంది.
ఇదే కాకుండా జయలలితపై మరో సినిమా, ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ కి సంబంధించిన టిజర్ ని కూడా బయటకు వదిలారు. డిసెంబర్ 5 న ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఇందులో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు.