పవన్ రిజెక్ట్ .. రామ్ అక్సేప్ట్ ?

రాజకీయాల్లో ఊపిరడనంత బిజీగా ఉంటూనే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Update: 2020-02-15 11:19 GMT

రాజకీయాల్లో ఊపిరడనంత బిజీగా ఉంటూనే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికే పవన్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న పింక్ మూవీ రీమేక్ షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ మెగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

అయితే పవన్ ఈ సినిమాల తర్వాత మరిన్ని సినిమాలు చేసేందుకు కథలు వింటున్నాడని సమాచారం. అందులో భాగంగానే గతంలో పవన్ స్టొరీని డైరెక్ట్ చేసిన దర్శకుడు బాబీ పవన్ కి ఓ స్టోరీ లైన్‌ని వినిపించార‌ట‌. కానీ ఆ లైన్ పవన్ కి అంతగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని, దీనితో అదే కథని మార్పులు చేసి హీరో రామ్ కి వినిపించారని స్టోరీ న‌చ్చడంతో రామ్ వెంట‌నే బాబీకి గ్రిన్‌సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.. ఈ సినిమాని కోన వెంకట్ నిర్మించనున్నారు.

గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో రామ్ ప్రస్తుతం రామ్ `రెడ్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇందులో రామ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తియిన త‌రువాతే బాబీ సినిమా సెట్స్ పైకి వ‌స్తుంద‌ని సమాచారం 

Tags:    

Similar News