మళ్ళీ యాంకర్ అవతారం ఎత్తిన ఓంకార్

Update: 2019-11-05 05:12 GMT
omkar

దర్శకుడు ఓంకార్ అంటే తెలియాని వాళ్ళు ఉండరు.. అయన దర్శకుడు కాకముందు బుల్లితెరపై యాంకర్ గా బాగా రాణించారు. ముఖ్యంగా ఆట షో ఆయనకి మంచి పేరును తీసుకువచ్చింది.. ఆ తర్వాత సినిమాలకి దర్శకత్వం వహించాడు ఓంకార్ ..రాజుగారి గది సీరీస్ లతో వరుసగా హిట్లు కొడుతున్నాడు ఓంకార్.. అయితే మళ్ళీ టీవీ గేమ్‌‌ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న 'సిక్స్త్‌‌సెన్స్‌‌' అనే షోని కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. దీనిని తన సొంత ప్రొడక్షన్ లోనే చేస్తున్నాడు ఓంకార్ .. అంతే కాకుండా హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈమధ్యే 'బిగ్‌‌బాస్‌‌' షో ముగియడంతో ఇప్పుడు అదే స్థానంలో 'సిక్స్త్‌‌సెన్స్‌‌ సీజన్‌‌ 3'ని స్టార్‌‌‌‌ మా ప్రసారం చేస్తుంది...ఇది కేవలం శని ఆదివారంల్లో మాత్రమే వస్తుంది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ షోని చూడొచ్చు..  

Tags:    

Similar News