ఇంద్ర సినిమాలో ఒక చేత్తో కట్టి పట్టుకుని.. మరో చేత్తో తొడ కొట్టిన బుడ్డోడు గుర్తున్నాడా? పోనీ, చూడాలనివుంది లో చిరంజీవి కొడుకుగా కనిపించిన పిల్లోడు తెలుసా? అవును.. తేజ! బాలనటుడిగా ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో అందరినీ మురిపించిన నటుడు. ఆ తరువాత కనిపించలేదు. ఇప్పుదు మళ్ళీ తెర మీదకు వస్తున్నాడు.
సమంత ముఖ్య భూమిక లో నటిస్తున్న సినిమా ఓ బేబీ! ఈ సినిమాలో సమంతకు మనవడిగా తేజ కనిపించబోతున్నాడు. సమంతకు మన్వాదిగానా అని మళ్ళీ ఆశ్చర్యపోవద్దు. మనవడిగానే. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా విశేషాల్ని చెప్పేందుకు గురువారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తేజ మీడియా తో మాట్లాడాడు. సినిమాలో తన పాత్ర గురించి వివరించాడు. ''ఒక మనిషికి సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ. అయితే, ఈ సినిమా నాకు సెకండ్ లైఫ్. మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభిస్తున్నా. 'ఓ బేబీలో సమంతగారు ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్‌కు వస్తారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పెద్దగా అయ్యాను. అంతే తేడా. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఎంత స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే'' అంటూ తేజ చెప్పాడు.
లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. .