ఎట్టకేలకు హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేడు హైదరాబాదులో షాలిని అనే అమ్మాయితో నితిన్ ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16 దుబాయ్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నితిన్ పెళ్లి చేసుకుంటున్న షాలిని ఓ డాక్టర్ అని వీరిద్దరికీ 2012లో పరిచయం కాగా, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమకి ఇరువురు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. తమ అభిమాన హీరోకి పెళ్లి అవుతుండడంతో నితిన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Pelli panulu started..
— nithiin (@actor_nithiin) February 15, 2020
Mussssikk startttts ❤️❤️❤️
Need ur blessings...🤗🤗 pic.twitter.com/bQ3zXUO7s6
2002 లో జయం సినిమాతో వెండితెరకి పరిచయం అయిన నితిన్ హీరోగా మొదట్లో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తరవాత కొన్ని అపజయాలు వచ్చినప్పటికి మళ్ళీ ఇష్క్ సినిమాతో నిలదొక్కుకొని వరస సినిమాలతో హిట్స్ కొడుతున్నాడు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.