నేను వస్తే సైరా ఫ్లాప్ అయ్యేది.. నయన తార షాకింగ్ కామెంట్స్..

Update: 2019-10-07 03:47 GMT

ఇన్నాళ్లూ ఆమె సినిమా ప్రచారానికి రాదంటూ అనేకమంది విమర్శలు చేశారు. కోట్ల రూపాయల్లోపారితోషకం తీసుకుంటుందని, తీరా ఆ సినిమా ప్రమోసనల్ యాక్టివిటీస్ కు మాత్రం హాజరు కాదని అనేకమంది అభియోగాలు మోపారు. స్టార్ హీరోలను కూడా నయనతార పట్టించుకోదంటూ అనేవారు. అలాంటి మాటలన్నింటికీ చెక్ పెట్టేందుకు, ఇకపై తనను ఎవరూ సినిమాల ప్రమోషనల్ యాక్టివిటీస్ కు పిలవకుండా ఉండేందుకు నయనతార ఒక అస్త్రాన్ని వదిలింది.

అదేమిటంటే తను ఏ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకున్నా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నయనతార లీక్ ఇచ్చిందట. ఇదివరకూ ఒక సినిమా ఆడియో రిలీజ్ వేదికకు తను వెళ్లానని, ఆ సినిమాలో నటించినందుకు గానూ అలా ప్రమోషన్ చేసినట్టుగా నయనతార చెప్పింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందని, ఆ తర్వాత తను ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకోని సినిమాలు ఒక్కొక్కటిగా హిట్ అవుతూ వస్తున్నాయని నయనతార చెబుతోందట. ఇప్పుడు సైరా అంత పెద్ద హిట్ అయిందంటే కారణం తను ప్రమోషనల్ యాక్టివిటీస్ లో లేకపోవటం వల్లనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఇక ముందు కూడ అలానే ఉంటానని చెబుతుందంటా.

ఈ లీక్ చాలు నయన్ తో సినిమాలు చేసే వారెవరూ సినిమాల ప్రమోషన్ కు రమ్మని పిలవరు. తనువస్తే సినిమా ఫట్ అవుతుందని ఆమే చెబితే, ఇక ఆమెను ప్రచార కార్యక్రమాలకు పిలిచేవారు ఎవరుంటారు? అసలే ఇండస్ట్రీ అంటే బోలెడన్ని సెంటిమెంట్లతో నడిచే పరిశ్రమ. అలాంటిది నయనతారను పిలిచే సాహసం ఎవరైనా చేస్తారా?

Tags:    

Similar News