నాని నిర్మాణంలో మరో "హిట్" మూవీ

నిర్మాతగా మారిన నటుడు నాని గతేడాది వాల్ పోస్టర్ సినిమా అనే సొంత బ్యానర్‌ను ప్రారంభించారు.

Update: 2019-10-24 08:29 GMT

నిర్మాతగా మారిన నటుడు నాని గతేడాది వాల్ పోస్టర్ సినిమా అనే సొంత బ్యానర్‌ను ప్రారంభించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'ఆ' ఆయన నిర్మాతగా  తొలి సినిమా. ఈ సినిమా ఎన్నో ప్రశంసలు పొందింది. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించింది. ఈసినిమ  జాతీయ అవార్డులను గెలుచుకుని నానీ కి మంచి పేరు తెచ్చింది.

ఇదే విధంగా ఇప్పుడు ఈ  జెర్సీ నటుడు తన రెండో చిత్ర నిర్మాణాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. నానీ తన  రెండో చిత్రం పేరు "హిట్" అని ఈ రోజు ప్రకటించారు. సైలేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ కథానాయకులుగా నటించారు. చి లా సౌ తో ఆకట్టుకున్న రుహానీ శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.



Tags:    

Similar News