అన్నంత పనీ చేశాడు.. ఫిల్మ్ చాంబర్‌ ముందు పురుగుల మందు తాగిన హీరో

Update: 2019-12-11 12:06 GMT
ఫిల్మ్ చాంబర్‌

నానిగాడు సినిమా హీరో ఫిల్మ్ చాంబర్‌ ముందు నిరసనకు దిగాడు. సినిమా విడుదల కాకుండానే యూట్యూబ్‌లో పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఫిల్మ్ చాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన ఆయన అన్నంత పనీ చేశాడు.

ఫిలిం చాంబర్ ముందు పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యూట్యూబ్‌లో సినిమా విడుదల కావడంపై దుర్గాప్రసాద్‌తోపాటు నానిగాడు చిత్ర బృందం కూడా ఫిలిం చాంబర్ ముందు ఆందోళనకు దిగింది. తాము 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి, సినిమా తీస్తే దాన్ని య్యూట్యూబ్‌లో పెట్టేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News