జబర్దస్త్ లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : నాగబాబు

నేను జబర్దస్త్ మానేయడానికి ఏవేవో రిజన్స్ బయటకు వస్తున్నాయి. అవి ఇంకా ఎక్కువ కాకుండా ఉండేందుకే నేను ఇప్పుడు

Update: 2019-11-21 15:20 GMT

ప్రముఖ నటుడు నాగబాబు జబర్దస్త్ షో నుండి తప్పుకున్నారని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన అయన తొలిసారిగా స్పందించారు. తన అధికార యుట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు మాట్లడుతూ " నాకు గురువారం ,శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు.. జబర్దస్త్ లో నా ప్రయాణం 2013 నుండి 2019 వరకు కొనసాగింది. ఇది నాకు ఎమోషనల్ జర్నీ.. నేను జబర్దస్త్ మానేయడానికి ఏవేవో రిజన్స్ బయటకు వస్తున్నాయి. అవి ఇంకా ఎక్కువ కాకుండా ఉండేందుకే నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఈ శుక్రవారంతో జబర్దస్త్ లో నా ప్రయాణం ముగుస్తుంది. నాకు నేనుగా షోని ముగించాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన శ్యాం ప్రసాద్ రెడ్డికి , ఈటీవీకి థాంక్స్.. అంటూ చెప్పుకొచ్చారు" నాగబాబు. 

Full View

Tags:    

Similar News