నా కంటే నా స్టాఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉందంటున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీకెండ్స్ లో పార్టీలు చేసుకుని..ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు బన్నీ స్టాఫ్. ఈ ఫోటోలు చూసిన ఆయన ఈ రోజు ఉదయాన్నే వాటిని షేర్ చేసి కామెంట్ చేశారు. ''ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. నా స్టాఫ్ సభ్యులు శనివారం రాత్రి పార్టీలు చేసుకుని ఫొటోలు దిగడం. రాత్రి వేళల్లో వారు ఎంజాయ్ చేసే విధానం చూస్తే వారి జీవితం నాకంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. నన్ను కూడా పిలవచ్చు కదా'' అంటూ వారిని ఆటపట్టించారు అల్లు వారబ్బాయి.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండిన Allu Arjun (@alluarjunonline) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది