Lockdown effect: ధియెటర్ల రీఎంట్రీకి దసరానే బెస్ట్ ఆప్షన్

కరోనా ప్రభావంతో నిత్యావసర వస్తువులకి తప్ప అన్ని మూతపడ్డాయి. ఇక చిత్రపరిశ్రమ విషయానికి వచ్చేసరికి కరోనా కట్టడిలో భాగంగా ముందుగా ధియేటర్ లను మూసివేసారు.

Update: 2020-04-23 02:58 GMT

కరోనా ప్రభావంతో నిత్యావసర వస్తువులకి తప్ప అన్ని మూతపడ్డాయి. ఇక చిత్రపరిశ్రమ విషయానికి వచ్చేసరికి కరోనా కట్టడిలో భాగంగా ముందుగా ధియేటర్ లను మూసివేసారు. అయితే ఇప్పుడు ధియేటర్ లను ఎప్పుడు తెరుస్తారు అన్నది సగటు అభిమాని ప్రశ్న.. అయితే లాక్ డౌన్ మే నెలాఖరు వరకు వుంటుందని తెలుస్తోంది.. అయితే జూన్ 15 తరవాత తెరిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నుంచి వస్తున్న మాట.. కానీ అల తెరిచినప్పటికి ఎలాంటి లాభం లేదనేది మరో వాదన..

ఎందుకంటే జూన్ 15 తర్వాత పిల్లలకి స్కూల్స్ మొదలవుతాయి. అప్పుడు విధ్యార్దుల తల్లితండ్రులు స్కూళ్లు, పుస్తకాలు, ఫీజులు, వాటి విషయంలో శ్రద్ధ చూపిస్తారు. అలాంటి టైంలో ధియేటర్ లకి రామన్నా రారు. ఇంకా అప్పటికి కరోనా భయం ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ధియెటర్లను తెరవడం వృధా అని ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో మాట.. ఇక జూన్, జులై ఆ నెలలు సాధారణంగా డల్ మంత్. అందువల్ల ఆగస్టు వరకు థియేటర్లు తెరుచుకున్నా, లేకపోయినా ఒకటే.

ఇక ధియెటర్ల రీఎంట్రీకి దసరా బెస్ట్ ఆప్షన్ అన్నమాట వినిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం, అప్పటివరకు కరోనా ప్రభావం పూర్తిగా కనుమరుగు అయ్యే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఎం జరుగుతుందో.. !  

Tags:    

Similar News