సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నవ్వులు పూయించిన మెగాస్టార్‌

Update: 2020-01-06 07:20 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో నవ్వుల పూవులు పూయించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో మెగాస్టార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. ఆయన స్పీచ్‌లో వాళ్ల రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూనే అప్పట్లో విజయశాంతి తనను తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు మెగాస్టార్.

విజయశాంతి, తాను ఎన్నో బ్లాక్ బస్టర్స్, హిట్ పెయిర్ తీశామన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. తామిద్దరం ఎలా ఉండేవాళ్లం అంటే హీరో హీరోయిన్లులా కాకుండా స్నేహితుల్లా ఉండే వారమన్నారు. టీ నగర్‌లో ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవాళ్లమని గుర్తు చేశారు. అయితే విజయశాంతి, చిరంజీవి మధ్య స్టేజ్‌పై సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

విజయశాంతిపై చిన్న కోపం ఉందని చిరంజీవి అనగా.. ఎందుకు అని విజయశాంతి చిరంజీవిని అడిగారు. అప్పట్లో తనను అన్ని మాటలు అన్నావ్.. మనసెలా వచ్చిందని చిరంజీవి అనడంతో స్టేజ్ అంతా నవ్వులతో నిండిపోయింది. చిరంజీవి వ్యాఖ్యలకు స్పందించిన విజయశాంతి... రాజకీయం వేరే సినిమా వేరు.. మీరు నా హీరో.. నేను మీ హీరోయిన్ అని అన్నారు. తనను ఎలా మరిచిపోతారు అంటూ మెగాస్టార్‌తో విజయశాంతి అనడంతో స్టేజ్‌ మొత్తం నవ్వులు పూశాయి.

Tags:    

Similar News