అమ్మో అవంతిక!

Update: 2019-07-09 05:04 GMT

అవంతిక పేరు చూసి సాఫ్ట్ అనుకుంటే కుదరదందోయ్! పక్కా డేంజరస్ బేబీ అంటున్నాడు మన్మధుడు. అక్కినేని నాగార్జున హీరోగా రాకుల్ ప్రీత్ సింగ్, కీర్త్ సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మన్మధుడు2 సినిమా టీజర్ విడుదలైంది. అవంతిక పాత్ర చేసిన రకుల్ పై దీనిని తయారు చేశారు. అవంతిక పేరు ఎంత సూపరో.. అంత పధ్ధతి గల అమ్మాయి అని పరిచయం చేస్తుంది టీజర్. చివరికి ఇప్పటివరకూ యూ సర్టిఫికేట్ చూపించా.. ఇక ఏ సర్టిఫికేట్ చూపిస్తా అంటూ రకుల్ నాగార్జునతో అంటూ సిగరెట్ కలుస్తూ లుక్కిస్తుంది.

ఇక మధ్యలో మన్మధుడు నాగార్జున 'రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా' అని రకుల్ కి చెప్తే రాకుల్ పకపకా నవ్వుతూ 'ఈ వయసులో నువ్వు లవ్‌ ఫెయిల్యూర్‌ తట్టుకోలేవ్' అంటూ వేసే సెటైర్ కి నాగ్ ఎక్స్ ప్రేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. మొత్తమ్మీద టీజర్ రకుల్ పాత్రని ఎలివేట్ చేస్తూ సరదాగా సాగి అందర్నీ ఆకట్టుకుంటోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View

Tags:    

Similar News