రాంచరణ్‌కు అవార్డు రాకపోవడంపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..

అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్‌ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.

Update: 2019-08-11 10:37 GMT

తాజాగా దేశంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం దేశ రాజధాని దిల్లీలో జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. 66 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈసారి తెలుగు సినిమా తన సత్తాచాటి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి చిత్రం గెలుచుకొని.. ఉత్తమనటిగా కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుకోగా.. రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. మరోవైపు ఉత్తమ నటుడుగా 'యూరీ' సినిమాలో నటకు విక్కీ కౌశల్‌తో పాటు 'అంధాదున్'లో నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా ఎంపికయ్యారు.

తాజాగా హీరో మంచు విష్ణు జాతీయ అవార్డులపై తన అభిప్రాయాన్ని ట్వీట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్‌ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ నటన. ఏది ఏమైన అభిమానుల ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్‌' అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. అంతకు మించిన అవార్డు ఏమి లేదన్నాడు విష్ణు. మంచు విష్ణు ట్వీట్‌ను మెగాభిమానులు మీరు చెప్పింది 100% కరెక్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు.



Tags:    

Similar News