మహర్షి మొదటి రోజు కలెక్షన్లు తెలుసా?

Update: 2019-05-09 12:57 GMT


మహేష్ బాబు 25 వ సినిమాగా మహర్షి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మహర్షి హంగామా చేస్తున్నాడు. ముగ్గురు ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించిన మహర్షి తొలిరోజు వసూళ్ల వర్షం కురిపించింది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా రికార్డు కలెక్షన్లు వాచినట్టు తెలుస్తోంది. అక్కడ 228 సెంటర్ల నుంచి 509 ,428 డాలర్లను కొల్లగొట్టింది మహర్షి. వారాంతానికి కలెక్షన్లలో రికార్డులు సృష్టించవచ్చని అక్కడనుంచి అందుతున్న సమాచారం. సినిమాలో మహేష్ బాబు మూడు వైవిధ్యభరితమైన లుక్స్ లో కనిపించడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాకి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ రావడంతో మహర్షి కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.  

Similar News