అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్బులో మహర్షి

Update: 2019-05-12 09:46 GMT

మహేష్ మహర్షితో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రతిష్టాత్మకంగా తన 25వ సినిమాని తీసుకున్న మహేష్ అందుకు అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విషయాన్ని సమన్వయ పరుచుకున్నారు. గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వారాంతానికి మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో సినిమా యూనిట్ అందరూ సంతోషంగా ఉన్నారు. మహేష్ బాబు మార్కు సినిమాగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మహర్షి. అమెరికాలో మహర్షి మిలియన్ డాలర్ల మార్కును దాటింది. మూడు రోజుల కలక్షన్ల వివరాలు పరిశీలిస్తే మొదటి రోజు ప్రీమియర్ల ద్వారా 516,000 డాలర్లను రాబట్టింది మహర్షి. మొదటి రోజు గురువారం 176,000 డాలర్లను  సూలు చేసిన ఈ సినిమా శుక్రవారం 236,000 డాలర్లను కొల్లగొట్టింది. ఇక శనివారం 100,000డాలర్లను తన ఖాతాలో వేసుకుని విడుదలైన మూడో రోజుకే మిలియన్ల డాలర్ల క్లబ్బులో చేరింది. కాగా, ఆదివారం మరింత ఎక్కువ కలెక్షన్లు రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

Similar News