Fathers Day 2020: మెగాస్టార్ తండ్రి నవ్వు..తనయుడి చిరునవ్వు!

ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది.

Update: 2020-06-21 11:10 GMT
Chiranjeevi, Ram Charan (File Photo)

ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. తన జీవితాన్ని త్యాగం చేసే ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిది. మహనీయమైనది నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం. పిల్లలను ఎవరినైనా మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చాలా మంది పిల్లల నుంచి వచ్చే సమాధానం ఎంటో తెలుసా.. నాకు మానాన్న అంటే చాలా ఇష్టం అని చెపుతారు. మరికొంత మంది నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెపుతుంటారు.

ఫాదర్స్ డే సందర్బంగా తండ్రితో తన బంధాన్ని తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు రామ్ చరణ్. తన చిన్నతనంలో తండ్రి చిరంజీవి తనను ఎత్తుకొని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫోటోలను.. తను తండ్రితో గడుపుతున్న సరదా సమయం ఫొటోస్ ను షేర్ చేస్తూ సందేశమిచ్చారు. ఇక రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఫొటోస్ కి ట్విట్టర్ లో పొగుడుతూ కామెంట్స్ చేసారు ఫ్యాన్స్. అదేవిదంగా చిరంజీవి సైతం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, రామ్ చరణ్ కు సంబందించిన ఫొటోస్ ను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. "మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం" అని ట్వీట్ చేసారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. అనే చిత్రంలో నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80 శాతం చిత్రేకరణ పూర్తి చేసుకుంది. అదేవిధంగా చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య' లోనూ చెర్రీ కీలకపాత్ర పోషిస్తున్నారు అని సమాచారం.




 



Tags:    

Similar News