ఒకేఒక్కడు రచయిత శివ గణేష్ మృతి

తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గేయ రచయితగా పనిచేసిన శివ గణేష్ బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని నివాసంలో ఆయన మృతి చెందారు.

Update: 2019-08-15 14:42 GMT

తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గేయ రచయితగా పనిచేసిన శివ గణేష్ బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని నివాసంలో ఆయన మృతి చెందారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన 'ప్రేమికులరోజు', 'నర్సింహ', 'జీన్స్‌', 'బాయ్స్‌', 'ఒకే ఒక్కడు' వంటి సూపర్ హిట్ చిత్రాలకు లిరిసిస్ట్‌గా పనిచేయడం ద్వారా శివ గణేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అజిత్ 'ఎంతవాడు గానీ' చిత్రానికి ఆయన తెలుగులో సాహిత్యం అందించారు.

దాదాపుగా వెయ్యికి పైగా చిత్రాలకు శివ గణేష్ గేయ రచయితగా పనిచేశారు. కేవలం గేయ రచయితగానే కాకుండా మాటల రచయితగా కూడా శివ గణేష్ సేవలందించారు. అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఒకే ఒక్కడు'కి తెలుగులో డైలాగులు శివ గణేష్ రాశారు. అనువాద చిత్రాలకే శివ గణేష్ ఎక్కువగా పనిచేశారు. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. శివ గణేష్ మృతికి పలువురు తెలుగు, తమిళ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News