ఈనెల 29న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల!

Update: 2019-03-26 03:03 GMT

గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశయమైన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిర్మాత రాకేష్ రెడ్డి వెల్లడించారు. దీంతో మార్చి 29న ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమాలో ఉన్న సీన్లు, డైలాగ్స్ విషయంలో జారీ అయిన సర్టిఫికేషన్ ను నిర్మాత రాకేశ్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ దీనిని పరిశీలించినట్టు ఆయన చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరిని తక్కువచేసి చూపించడం లేదని, ఎన్టీఆర్ జీవితం చివరి దశలో జరిగిన విషయాలను చెప్పేందుకే ఈ సినిమా చేశామని ఎన్నికల కమిషన్ కు వివరించానని.. ఈనెల 29న సినిమాను విడుదల చేయనున్నట్టు రాకేశ్ రెడ్డి తెలిపారు. 

Similar News