'అఖిల్‌' హీరోయిన్ తో ఆర్య పెళ్లి?

Update: 2019-01-09 14:01 GMT

తమిళ నటుడు ఆర్య ప్రేమలో ఉన్నారా.. త్వరలో నటి సాయేషాతో పెళ్లికూడా చేసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.ఆర్య, సాయేషా మధ్య ప్రేమ చిగురించిందని కొంతకాలంగా కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తరవాత వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఆర్య, సాయేషా లు తమ ప్రేమ విషయాన్నీ ఖండించకపోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చుతోంది.

ప్రస్తుత్తం వీరిద్దరూ దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న‌ 'కాప్పాన్‌' సినిమాలో నటిస్తున్నారు. గజనీకాంత్‌ లో కలిసి పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పాడ్డ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని అంటున్నారు. ఇదిలావుంటే ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా భానుల మనవరాలే సాయేషా. 'వనమగన్', 'కడైకుట్టి సింగం', 'జుంగా', 'గజనీకాంత్‌' లాంటి కోలీవుడ్‌లో చిత్రాల తోపాటు హిందీలో అజయ్‌ దేవగణ్‌ సినిమా 'శివాయ్‌'లో తెలుగులో అఖిల్‌' సినిమాలో సాయేషా నటించింది. 

Similar News