జర్నలిస్టులకు సాయం చేసిన హీరో కమల్ హాసన్!

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది.. చాలా మంది ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నారు..

Update: 2020-05-10 07:20 GMT
Kamal Haasan (File Photo)

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది.. చాలా మంది ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నారు.. ఇక కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు, వైద్యులు , పారిశుద్ధ కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. పలు చోట్లల్లో కూడా జర్నలిస్టులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి తమిళ హీరో కమలహాసన్ ముందుకు వచ్చారు..

కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 40 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరి చొప్పున 15 వేల రూపాయలను... మొత్తం ఆరు లక్షల రూపాయలను కమల్ అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక అంతకుముందు ఓ జర్నలిస్ట్ తన తల్లి ఆసుపత్రి ఖర్చులను భరించలేని స్థితిలో ఉండగా నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుకు వచ్చి ఆ మొత్తం బిల్లును కట్టిన సంగతి తెలిసిందే.. 


Tags:    

Similar News