ఆదిత్య 369 లో ముందుగా ఆ పాత్రకి ఈ హీరోను అనుకున్నారట!

బాలకృష్ణ రెండు పాత్రలో కనిపించారు. అందులో ఒకటి కృష్ణ కుమార్ గా, మరొకరు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించారు

Update: 2019-11-22 14:37 GMT
aditya 369

నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆదిత్య 369.. సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొని బాలకృష్ణ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలో కనిపించారు. అందులో ఒకటి కృష్ణ కుమార్ గా, మరొకరు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించారు. టైం మిషిన్ తో సినిమా సాగడం ప్రేక్షలను బాగా ఆకట్టుకుంది.

అయితే ఇందులోని కృష్ణ కుమార్ పాత్రకి గాను ముందుగా కమల్ హసన్ ని అనుకున్నారట దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు.. మరో పాత్ర శ్రీకృష్ణదేవరాయలుకి మాత్రం బాలకృష్ణనే అనుకున్నారట. ఇలా ఇద్దరితో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ భావించారట.. కానీ అప్పటికే కమల్ హసన్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేకపోయారట..దీనితో ఆ రెండు పాత్రలోనూ బాలకృష్ణనే నటించారు.  ఈ విషయాన్ని అయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.   

Tags:    

Similar News