అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కాజల్ ?

Update: 2019-06-09 16:46 GMT

నేను పక్క లోకల్ అంటూ జనతా గేరేజ్ లో ఓ పాటకి డాన్స్ చేసి మార్కులు కొట్టేసిన చందమామ కాజల్ అగర్వాల్ ఇపుడు మరో సినిమాలో తళుక్కున మెరవడానికి సిద్ధం అవుతోందట. సినిమా పూర్తిగా చేసిన పాత్ర కంటే.. ఒక్కో సినిమాలో ఈ ప్రత్యేక గీతాలే ఎక్కువగా ప్రజల్లోకి పోతుంటాయి. అందుకే అప్పుడప్పుడు హీరోయిన్లు ఇలా ఒక్కో పాటలో మేని విరుస్తారు. అంతే కాకుండా సొమ్ములు  కూడా ఈ తరహా పాటలకు ఎక్కువగానే ముడతాయి. ఇదిలా ఉంటె.. కాజల్ అగర్వాల్ ఇపుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒకే చెప్పిందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ వార్తే గనక నిజమైతే మళ్ళీ ఓ స్పెషల్ సాంగ్ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుందన్న మాటే!


Tags:    

Similar News