హీరో నుంచి విలన్ గా టర్న్ అయినా జగపతి బాబుకు ఇప్పడు అన్నీ అవకాశాలే! హీరోగా కూడా ఎపుడూ ఇంత బిజీగా జగపతి లేరు. ఇపుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో నెంబర్ వన్ స్థానంలో ఆయనే ఉన్నారు. బాలకృష్ణ లెజెండ్ లో విలన్ గా మెప్పించిన జగపతి ఇపుడు బాలయ్య తాజా చిత్రం లోనూ విలన్ గా నటిస్తున్నారు. అయితే, విలన్ గా ఈ సినిమాలో జగపతి బాబు డ్యూయల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారట.బాలకృష్ణ 105వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కేబోతున్న ఈ సినిమాలో లేడీ విలన్ ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగింది. ఇపుడు జగ్గూ భాయ్ విలన్ గా రెండు క్యారెక్టర్లను చేస్తున్నాడంటున్నారు. హీరోలు డబుల్, ట్రిపుల్ మనకు కొత్త కాదు. కానీ, విలన్ డబుల్ యాక్షన్ వినడానికి కొంత వింతగా ఉంది.
మే 17న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోయే ఈ సినిమా జూన్ నుండి చిత్రీకరణను జరపుకోనుంది. `జైసింహా` వంటి విజయం తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కలయికలో వస్తున్న సినిమా ఇది.