బీజేపీలో చేరిన సినీ నటి నమిత

సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఆమె రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో నమిత 2016లో

Update: 2019-11-30 15:54 GMT
Namitha

హీరోయిన్ నమిత బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయం జెండా కప్పుకున్నారు. ఆమెతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు.. తెలుగు, తమిళంలో నటించిన నమిత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. సొంతం, జెమిని, బిల్లా, సింహ లాంటి తెలుగు చిత్రాలలో నటించారు నమిత..

ఆ తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఆమె రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో నమిత 2016లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఇప్పుడు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో నమిత పోటి చేస్తారని తెలుస్తుంది. 

Tags:    

Similar News