హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు?

Update: 2019-03-28 02:48 GMT

దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. అయితే షూటింగ్‌లో ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు

తీవ్రంగా గాయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో విశాల్‌ కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్‌ ఫోటో బయటకు విడుదల అయింది. మరోవైపు ఈ ఫోటోపై విశాల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. షూటింగ్ కోసం ఇలా కట్లు కట్టారా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అనే విషయం బయటకు రావాల్సి ఉంది. 

Similar News