కరోనా క్రైసెస్ చారిటీకి హీరో గోపీచంద్ పది లక్షల విరాళం

Update: 2020-04-22 10:52 GMT

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగలపైనా పండింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి, దీనితో రోజు వారీ వేతనాలు చేసుకునే సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు తెలుగు ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛారిటీ కి తమ వంతు సాయంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు.

తాజాగా కరోనా క్రైసెస్ చారిటీకి తనవంతు సాయంగా హీరో గోపీచంద్ రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. అదేవిధంగా 1500 మందితో కూడిన అనాథ శరణాలయానికి ఆహారం అందిస్తున్నారు. రెండు నెలలపాటు ఆయన వీరి ఆకలి తీర్చనున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2000మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గోపిచంద్ ఔదార్యంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. 

Tags:    

Similar News