అర్ధరాత్రి హీరోయిన్ తో బైక్ పై విజయ్ సాహసం..
యూత్ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే..
యూత్ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కరణ్ జొహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబైలో పూజా కార్యక్రమలతో మొదలైన ఈ సినిమా శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ముంబై వీధుల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్, అనన్యపై బైక్ పై వెళ్తుండగా విలన్ చేజింగ్ సిన్స్ ని దర్శకుడు పూరి తెరకేక్కిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇందులో హీరోయిన్ అనన్య విజయ్ బైక్ పైన కొన్ని సన్నివేశాల్లో బైక్ వెనుకల, మరికొన్ని సన్నివేశాల్లో బైక్ ముందు ఉన్నట్టుగా ఫోటోలు ఉన్నాయి.
ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ అని ఫిక్స్ చేసినప్పటికీ దీనిపైన కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అందువలన టైటిల్ ని చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది విజయ్ కి పదో సినిమా కావడం విశేషం... భారీ అంచనాల నడుమ ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక విజయ్ గత చిత్రాలు అయిన డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో నిరాశపరిచాడు. దీనితో ఈ సినిమా పైన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ బాషలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు.
#VD10 Shooting stills 🔥
— Rowdyisloved ❤️ || VDFC™ (@Rowdyisloved) February 29, 2020
🏍️🏍️🏍️ @TheDeverakonda 🏍️🏍️#VijayDeverakonda #Rowdyisloved@HEROVIJAY9 pic.twitter.com/iKfoGfQrYm