ఎంతమంచివాడవురా!

Update: 2019-07-05 05:19 GMT

నందమూరి కళ్యాణ్ రాం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు టైటిల్ లోగోను విడుదల చేశారు.

చల్లగా వాన పడుతున్న సమయంలో.. జనరంజని పాటల కార్యక్రమంలో అక్కినేని నటించిన నమ్మినబంటు సినిమాలోని పాట రేడియోలో వస్తుండగా... ఇద్దరు చిన్నపిల్లలకు సైకిల్ మీద వచ్చి మొక్కజొన్న కంకులు కొని ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్న కళ్యాణ్ రామ్ టైటిల్ టీజర్ లో కనిపించారు. ఆకట్టుకునేలా ఈ టీజర్ ఉంది. దేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.  

Tags:    

Similar News