ఒక మాట జారితే అది ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో అంటారు పెద్దలు. ఇప్పుడు కాలం మారింది కదా.. ఒక్క మాట జారితే ఎంత ట్రోలింగ్ కు గురికావాల్సి వస్తుందో అని అనాల్సి వస్తోంది. అవును.. కబీర్ సింగ్ అదేనండి మన హిందీ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఓ మహిళతో ప్రేమలో ఉన్నప్పుడు అందులో చాలా నిజాయతీ ఉంటుంది. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు అక్కడ ప్రేమ, ఎమోషన్ ఉంటుందని నేను అనుకోను. ఓ అబ్బాయి తన సొంతం అనుకున్న అమ్మాయిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్ కనిపించదు' అన్న మాటలు నేట్టింట్లో విపరీతంగా ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే.
సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు లక్ష్మి వంటి వారు సందీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో తాప్సీ కూడా చేరారు.
నిన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా ఆర్టికల్‌ను తాప్సి ట్యాగ్ చేస్తూ.. 'అనుమానంతో తల పగలగొట్టాడా? బహుశా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో' అంటూ సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తాప్సి.
తాప్సి ట్వీట్ పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి వెంటనే ఆమె 'హెచ్చరిక: హాస్యచతురత లేని వారు నా ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు తాప్సీ ట్వీట్ లు నేట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Or maybe let's just say they were madly in love with each other n this 'act' was to validate his TRUE love for her. 🤷🏻♀️ https://t.co/BGmhA7XHyM
— taapsee pannu (@taapsee) July 15, 2019