ఎస్ ఎస్ రాజమౌళి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు . బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అయన మంచి పేరు సంపాదించుకున్నారు . అయితే ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు రాజమౌళి . టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటితో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసారు రాజమౌళి .. నమ్మకానికి అయనో రూపం , అయనది చిన్న పిల్లాడి మనస్తత్వం, ఆయన నా వెన్నంటి ఉండే బలం , ఆయనే నా భీమ్ ... నేను అతనికి ఆనందం తప్ప మరేమీ కోరుకోనని ఆర్ఆర్ఆర్ యే దోస్తీ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు రాజమౌళి .. దీనితో రాజమౌళి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేశారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు .
If destiny favours you, you will meet a human like Sai garu in life. Someone who's a child at heart, symbol of trust and a huge support. He's my Bheem and I wish him nothing but happiness..:)#RRRYehDosti pic.twitter.com/vBJ61JUd6X
— rajamouli ss (@ssrajamouli) August 4, 2019