Puri Jagannadh: దర్శకేంద్రుడిని క్షమాపణలు కోరిన పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, దర‌‌‌‌‌్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పారు.

Update: 2020-03-13 09:16 GMT
puri jagannadh say sorry to raghavendra rao

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, దర్శకేంద్రడు రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పారు. అనుష్క వెండితెరకు పరిచయమై 15 సంవత్సరాలైన సందర్భంగా 'నిశబ్దం' చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్ గా ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేడుకకి రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరి జగన్నాధ్, వైవి యస్ చౌదరి, చార్మీ మొదలగువారు హాజరయ్యారు. ఈ సందర్బంగా పూరి దర్శకుడు రాఘవేంద్రరావ్ కి క్షమాపణలు చెప్పారు..

" నా మొదటి సినిమా పూజా కార్యక్రమానికి రాఘవేంద్రరావ్ వచ్చి క్లాప్‌ కొట్టి, నన్ను ఆశీర్వదించారు. ఆ సమయంలో అయన నీ పేరు ఏంటి అంటే జగన్ అన్నాను మరి ఏంటి ఈ గడ్డం నేను తమిళోడివి అనుకున్నాను అని అన్నారు ఆ సమయంలో సర్‌ మీకూ గడ్డం ఉంది కాదా మేము అనుకోవడం లేదు కదా అని అన్నాను. అప్పుడు ఆయన వెంటనే నీకు వెటకారం బాగానే ఉంది అంటూ సరదాగా అన్నారు. ఆ తర్వాత సూపర్ సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ అయనని కలిశాను.. ఆ సమయంలో అయన నాగార్జున డేట్స్ కోసం వచ్చారు.

ఏంటి సార్ ఇక్కడ అన్నాను" ఎం లేదు నాగార్జున డేట్స్ కోసం వచ్చాను అన్నారు.. నాగార్జున డేట్స్‌ ఎందుకు సర్‌. మీరు రిటైర్‌ అయిపోండి అని అన్నాను.. అప్పుడు అయన నా భుజం తట్టి వెళ్ళిపోయారు. నాగార్జున నాకు, రాఘవేంద్రరావుకి డేట్స్ ఇచ్చారు. నేను ఫ్లాప్‌ సినిమా చేశాను. ఆయన మాత్రం 'అన్నమయ్య' లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తీశారు. అప్పుడు వాగిన వాగుడికి ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నా" అని పూరి వెల్లడించారు.

గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది విజయ్ దేవరకొండకు పదో సినిమా. పూరీకి 37వ చిత్రం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.  

Tags:    

Similar News