మెగా హీరోకి ఛాలెంజ్ విసిరిన హరీష్ శంకర్
ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో మెగా డైరెక్టర్ హరీష్ శంకర్ తన నివాసంలో మొక్కలు నాటి కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు క్రాంతి కిరణ్, సంతోష్ కుమార్ ఉన్నారు.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.." నా మిత్రుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు హరితహరాన్ని సపోర్ట్ చేయండి! వర్షపాతానికి, పర్యావరణ సంక్షేమానికి ఇది ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీఆర్కు హ్యాపీ బర్త్డే. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాని" హరీష్ అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి నామినేట్ చేయగా వరుణ్ దీనిని అక్సేప్ట్ చేశాడు.
గత ఏడాది వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది! గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ తరవాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
Thanks alot MLA saab... for this wonderful opportunity @KrantiKiranTRS its my pleasure and responsibility to take part in #HarithaHaram on the occasion of our beloved CM @TelanganaCMO Sri KCR Sir s birthday !!!! pic.twitter.com/PxXW1rFcD7
— Harish Shankar .S (@harish2you) February 17, 2020