''ఒక కామ్రేడ్ పోరాడితే.. అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి. స్వేచ్చ నివ్వాలి. కానీ, నిన్ను చూస్తుంటే అలా లేవు.'' ''వచ్చినపుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయాకా ఎందుకింత బాధ పెడుతుంది?'' ''నీ తోడుగా ఉంటానని చెప్పావు. కానీ, నిను ఎప్పుడు ఎలా చూస్తానోనని భయమేస్తోంది.'' ''నన్ను భయపెడుతున్నా అనుకుంటున్నారేమో'' ఇవీ విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా డియర్ కామ్రేడ్ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్. మూడు నిమిషాల ట్రైలర్ లో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. విజయ్ పాత్రలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూపిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందనకు విజయ్ కు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా మిక్స్ చేశారు. మొత్తం ట్రైలర్ అంతా విజయ్ అభిమానులకు పండగ చేసేలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న రిలీజ్కు రెడీ అవుతోందీ సినిమా. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. శృతి రామచంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు.